నారపల్లిలో ఘటన
కేసు నమోదులో జాప్యం అంటూ పీఎస్ వద్ద బంధువుల ఆందోళన
నవతెలంగాణ-బోడుప్పల్
సీనియర్స్ ర్యాగింగ్‌కు బీటెక్ విద్యార్థి బలయ్యాడు. ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి నారపల్లిలో జరిగింది. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన జాదవ్ సాయితేజ నారపల్లిలోని ఓ ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ అక్కడే ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. కళాశాలలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌తో మనస్థాపం చెందిన సాయితేజ ఆదివారం రాత్రి హాస్టల్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ”సీనియర్‌లు తనను బార్‌కు తీసుకెళ్లి.. వారు మద్యం సేవించి నన్ను బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారు” అంటూ సాయి తేజ సెల్ఫీ వీడియో ద్వారా తండ్రికి పంపాడు. సాయిపై దాడి సమయంలో సీనియర్స్‌తో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నారనేది తల్లిదండ్రుల అనుమానం. కేసు నమోదు చేయడంలో జాప్యం అవుతున్నదని సోమవారం బంధువులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు కారణం ర్యాగింగ్‌నేనా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తండ్రి పిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవింద రెడ్డి తెలిపారు.
ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES