Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణా శాఖ కమిషనర్‌గా రఘునందన్‌రావు బాధ్యతల స్వీకరణ

రవాణా శాఖ కమిషనర్‌గా రఘునందన్‌రావు బాధ్యతల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.రఘునందన్‌రావు గురువారం హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ, సహకార శాఖలతో పాటు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను ప్రభుత్వం తాజాగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమించడంతో పాటు రవాణాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక్కడ పనిచేసిన సురేంద్ర మోహన్‌ను వ్యవసాయ, సహకార శాఖల కార్యదర్శితో పాటు ప్రభుత్వ కార్యదర్శిగా నియమించింది. ఇక రవాణా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.రఘునందన్‌ రావును హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ సి.రమేష్‌ కలిసి పూలబోకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జేటీసీలు, డీటీసీలు, ఆర్టీవోలు కలిసి ఆయనకు అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన ఆ శాఖలోని సీనియర్‌ అధికారులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -