– బీబీనగర్ ఎయిమ్స్‌లో నివాళులర్పించిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, నేతలు
నవతెలంగాణ-బీబీనగర్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గంగసాని రఘుపాల్ ఆశయ సాధన కోసం ఎర్రజెండా శ్రేణులు పనిచేయాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కోరారు. ఆదివారం రఘుపాల్ (84) భౌతికకాయాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి అప్పగించారు. ఈ సంద ర్భంగా రఘుపాల్ భౌతికకాయానికి రాఘవులు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పాలడుగు భాస్కర్, ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ మడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, స్కైలాబ్‌బాబు, మోకు కనకారెడ్డి, తదితరులున్నారు. ఈ సందర్భంగా బీవీ. రాఘవులు మాట్లా డారు. రఘుపాల్ తన చిన్న వయస్సు నుంచే కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితుడై పనిచేస్తూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుని గా, సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కార్యదర్శిగా మూడు ధపాలు బాధ్యతలు నిర్వహించారని తెలి పారు. వయస్సు మీదపడినా ప్రజల సమస్యలపై ఎంత దూర మైన వెళ్లి పనిచేసేవారని తెలిపారు. ఆయన నిరాడంబరమైన జీవితం నేటి యువతకు ఆదర్శ ప్రాయంగా ఉంటుందని తెలిపారు. జీవితాంతం ఎర్రజెండా పట్టుకొని పనిచేశారన్నారు. ఆయన ఆశయసాధన కోసం ఎర్ర జెండా శ్రేణులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి.రాములు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, సోమయ్య, జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, కల్లూరు మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నర్సింహ, సిర్పంగి స్వామి, వీర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, నాయకులు కందాడ దేవేందర్ రెడ్డి, ఓవల్దాస్ సతీష్, హరికృష్ణ, బొల్లేపల్లి కుమార్, ఏదునూరి మల్లేశం, బూడిద గోపి తదితరులు పాల్గొన్నారు.
ఎయిమ్స్ ఆస్పత్రికి రఘుపాల్ భౌతికకాయం అప్పగింత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES