- Advertisement -
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) సీనియర్ నేత రఘుపాల్ అసాధారణ వ్యక్తిత్వం కలిగిన నాయకుడని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం చెప్పారు. పేద ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. తుదికంట పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం బాధాకరమంటూ సంతాపాన్ని తెలిపారు. రఘుపాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -