Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీఏడీ ముఖ్య కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా

- Advertisement -

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఆ మేరకు 45 మందిని ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌లతోపాటు పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాను సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సంజయ్ కుమార్‌ను పంచాయతీరాజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా, సబ్యసాచి ఘోష్‌ను ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు యూనిట్‌ స్పెషల్‌ సీఎస్‌గా, ఎన్‌ శ్రీధర్‌ను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ఇ.శ్రీధర్‌ను ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ లాంగ్‌ లీవ్‌ కారణంగా ఆ బాధ్యతలను కార్మిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ దానకిషోర్‌కు అప్పగించారు.

ఆర్ధిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా గౌరవ్‌ ఉప్పల్‌ నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ బి విజయేంద్రను తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ కార్యదర్శిగా బదిలీ చేశారు. సెర్ప్‌ సీఈవో డి.దివ్యకు ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మహబూబాబాద్‌ కలెక్టర్‌ అద్వైత్‌ కుమార్‌ను తెలంగాణ భవన్‌ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ ఎం హనుమంతురావును దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా, నారాయణపేట్‌ కలెక్టర్‌ సిగ్తా పట్నాయక్‌ను ఆర్ధిక శాఖ స్పెషల్‌ సెక్రటరీగా, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ ఝాను జనగాం కలెక్టర్‌గా, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారప్‌ అలీని మూడో డిస్కమ్‌ సీఎండీగా, కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి కార్మిక శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా, మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సహకార శాఖ స్పెషల్‌ కమిషనర్‌, రిజిస్ట్రార్‌గా, భవేశ్‌ మిశ్రను ఐటీ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా జితేష్‌ వి పాటిల్‌ ను ప్రభుత్వం బదిలీ చేసింది.

జనగాం కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ను జోగులాంబ గద్వాల్‌ కలెక్టర్‌గా, అక్కడికలెక్టర్‌ సంతోష్‌ బిఎంను గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా, వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నారాయణపేట్‌ కలెక్టర్‌గా, హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ను మహబూబాబాద్‌ కలెక్టర్‌గా,స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కాత్యాయని దేవి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ జి ఫణీంద్ర రెడ్డి నారాయణపేట్‌ అదనపు కలెక్టర్‌గా, ఎటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ చిత్ర మిశ్రను కరీంనగర్‌ కలెక్టర్‌గా, గరిమా అగర్వాల్‌ను రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా, దీపక్‌ తివారీని వికారాబాద్‌ కలెక్టర్‌గా, ప్రతిమా సింగ్‌ను మెదక్‌ కలెక్టర్‌గా, అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా, చహత్‌ బాజ్‌పేయిని హనుమకొండ కలెక్టర్‌గా నియమిస్తూ జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.

కుష్బూ గుప్తను మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా, మంద మకరందును జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్‌ జోనల్‌ కమిషనర్‌గా, ఫైజాన్‌ అహ్మద్‌ ను మెడ్చల్‌ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా, శివేంద్ర ప్రతాప్‌ను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, హచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కమిషనర్‌గా పింకేశ్‌ కుమార్‌ లలిత్‌కుమార్‌ను, వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌గా ఉమా శంకర్‌ ప్రసాద్‌, నాగర్‌కర్నూల్‌ అదనపు కలెక్టర్‌ జివి శ్యాం ప్రసాద్‌, మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా పి చంద్రయ్య, వరంగల్‌ అదనపు కలెక్టర్‌ గా వైవి గణేష్‌, సిద్ధిపేట అదనపు కలెక్టర్‌గా అబ్దుల్‌ హమీద్‌, నిర్మల్‌ అదనపు కలెక్టర్‌గా బి వెంకటేశ్వర్లు, వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఎన్‌ కీమ్యా నాయక్‌ను, ఇండిస్టీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ అదనపు సీఈవోగా కె విద్యాసాగర్‌ను, ప్రజావాణి అడిషినల్‌ నోడల్‌ ఆఫీసర్‌గా ఎం సురేందర్‌ను ప్రభుత్వం నియమించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -