నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల్లో తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన పూంఛ్ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను రాహుల్ దత్తత తీసుకోనున్నట్లు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ వెల్లడించారు. ఆ చిన్నారులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేవరకు వారి విద్య, వైద్యం, మనుగడకయ్యే ఖర్చులను ఇకపై రాహుల్ చూసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఘర్షణ నేపథ్యంలో దాయాది చర్యలకు దెబ్బతిన్న జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాలను రాహుల్ గాంధీ సందర్శించిన సమయంలో పూంఛ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సంబంధించిన వివరాలు తీసుకొని ఓ జాబితా రూపొందించాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు హమీద్ తెలిపారు. దీంతో సర్వే చేసి 22 మంది చిన్నారుల జాబితాను రూపొందించామని పేర్కొన్నారు.పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ తో మన బలగాలు దీటుగా బదులిచ్చాయి. అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ .. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. పాక్ చర్యలకు పూంఛ్ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అక్కడ 25 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
పూంఛ్‌లో 22 మంది చిన్నారులను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES