Wednesday, July 16, 2025
E-PAPER
Homeజాతీయంపరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్‌

పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి బెయిల్‌

- Advertisement -

లక్నో : ఆర్మీ సిబ్బందిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌గాంధీకి లక్నో కోర్టు మంగళవారం బెయిల్‌ మంజారు చేసింది. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ తరుపు న్యాయవాది ప్రాన్షు అగర్వాల్‌ మీడియాకు తెలిపారు. ఈ కేసు విచారణ కోసం లక్నోలోని ఎంపి- ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. జడ్జి గదికి న్యాయవాది రాహుల్‌గాంధీని తీసుకుని వెళ్లారు. అక్కడ బెయిల్‌ బాండ్‌, పూచీకత్తు దాఖలు చేయడం వంటి లాంఛనాలను రాహుల్‌గాంధీ పూర్తి చేశారు. రాహుల్‌ వెంట ఉత్తరప్రదేశ్‌ పిసిసి అధ్యక్షులు అజరు రారు, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అవినాష్‌ పాండే ఇతర నాయకులు ఉన్నారు. రాహుల్‌ గాంధీ హాజరు సందర్భంగా కోర్టు ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
2022 డిసెంబరు 16న భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ భారత్‌ సైనికుపై చైనా సైనికులు దాడి చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత సైనికుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌ (ఆర్మీలో కల్నల్‌ హోదాకు సమానం) ఉదరు శంకర్‌ శ్రీవాస్తవ పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు రాహుల్‌గాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టును రాహుల్‌గాంధీ ఆశ్రయించారు. కానీ అక్కడ ఉపశమనం లభించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -