గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాంచందర్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారత రాజ్యాంగాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమైనందనీ, అది బాధ్యతగా భావించాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు మేలు చేసేలా ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశంలో జరుగుతున్నది ఓటు చోరీ కాదు… రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింద న్నారు. ‘వీబీ జీ రామ్ జీ’ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శిం చారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ రెండూ అవినీతి పార్టీలేనన్నారు. ఈ వేడుకల్లో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్‌రావు, వేముల అశోక్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



