Thursday, June 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలో గురువారం ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోరే రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరపున రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బుచ్చి మల్లయ్య, నాయకులు వేములవాడ జగదీష్, దూలూరి కిషన్ గౌడ్, పూజారి శేఖర్, మారయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, సింగిరెడ్డి శేఖర్, సల్లూరి గణేష్ గౌడ్, నల్ల సాయికుమార్ గుప్తా, సంపంగి నాగరాజు, నరేష్, క్రాంతి, రాజేష్, సుంకరి గంగాధర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -