Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : దేశ ప్రజలకు రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకొని రక్షించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. పరకాల శాసనసభ్యులు రేవురు ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసు మాట్లాడుతూ దేశ ప్రజల ఐక్యత కోసం రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా కృషి చేశారన్నారు. యాత్రలో ఇచ్చిన హామీ మేరకు జనగణలో కులగనన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కుల గననకు ఆమోదం తెలిపేలా రాహుల్ గాంధీ కృషి చేశారని గుర్తు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిత్యవసర సరుకుల ధరలను పెంచి పేదవారిపై భారం మోపుతుందని, దేశంలో కుల మతాల గొడవలు సృష్టించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీన పరుస్తుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకొని పార్లమెంటులో ప్రజల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ ప్రజలకు రక్షణ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు బొచ్చు చందర్, సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్, ఎండి రంజాన్ అలీ, పోరండ్ల సంతోష్, మేరుగు శ్రీశైలం, బండి సదానందం, చందుపట్ల రాఘవరెడ్డి, నల్లెల్ల అనిల్ , మార్క రఘుపతి గౌడ్, దుబాసి వెంకటస్వామి, జాఫర్ రిజ్వి , వొంటేరు శ్రావణ్ కుమార్, పోరండ్ల వేణు, మంద నాగరాజు, పబ్బ శ్రీనివాస్, పాలకుర్తి శ్రీనివాస్, జంగలి సతీష్, గడ్డం శివ, బొచ్చు శ్రీధర్, జెమిని, బొమ్మ కంటి చంద్రమౌళి, దొమ్మటి నాని, అల్లం శ్రీరామ్, ఏకు రవికుమార్, దుప్పటి సాంబశివుడు, బండారు కృష్ణ, కోటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad