నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలం కాంగ్రెస్ సీనియర్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధి జన్మదిన వేడుకలు నిర్వహించారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ప్రారంభించారు. హాజరైన అథితులందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. పేదలకు అన్నదానం నిర్వహించారు. రాహుల్ గాంధీ యువతకు ఆదర్శంగా ఉంటూ వారి అడుగుజాడలో యువజన నాయకులందరూ కలిసి ఆయన వెంట ఉంటామని సీనియర్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివానంద్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్ , మాజీ జెడ్పిటిసి సాయా గౌడ్ , చాకలి కృష్ణ , సూర్నార్ మనోహర్ పటేల్ , బిజ్జాల్ వాడి మాజీ సర్పంచ్ యాదు , గంగు నాయక్, కమలాకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES