Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాహుల్‌గాంధీ ప్రతిష్టకే నష్టం

రాహుల్‌గాంధీ ప్రతిష్టకే నష్టం

- Advertisement -

భ్రమల్లో సీఎం రేవంత్‌రెడ్డి : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక వ్యూహం ప్రకారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి పోటీ పడటానికి వెనుకాడతున్నట్టు, రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాహుల్‌ గాంధీని బలహీన నేతగా చూపించే కుట్ర అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అర్హత సీఎం రేవంత్‌కు ఉందా?అని ప్రశ్నించారు.

దానివల్ల రాహుల్‌ ప్రతిష్టకే నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. అవినీతి సొమ్ముతో వచ్చిన అహంకారంతోపాటు సీఎం రేవంత్‌ భ్రమల్లో ఉన్నారని తెలిపారు. రాహుల్‌ గాంధీ నాయకత్వం ఎవరి ప్రశంసల మీద ఆధారపడి లేదని స్పష్టం చేశారు. ‘భారత్‌ జోడో యాత్ర’ వంటి చారిత్రాత్మక ఉద్యమాలతో కోట్ల మంది ప్రజల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారని వివరించారు. ఇలాంటి అంశాలు కాంగ్రెస్‌ ప్రతిష్టను దిగజారుస్తాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి స్వార్థపూరిత పబ్లిసిటీ కోసం జాతీయ రాజకీయాలను జోక్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -