Monday, November 10, 2025
E-PAPER
Homeఆటలురాహుల్‌ రాదేశ్‌ సెంచరీ

రాహుల్‌ రాదేశ్‌ సెంచరీ

- Advertisement -

హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ 364/10

నవతెలంగాణ-హైదరాబాద్‌
రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో ఉప్పల్‌ స్టేడియంలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంపై కన్నేసింది. తొలుత, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రాహుల్‌ రాదేశ్‌ (129, 202 బంతుల్లో 16 ఫోర్లు) సెంచరీతో రాణించటంతో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 364/10 పరుగులు చేసింది. స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్‌ (2/58), అనికెత్‌ రెడ్డి (2/50) మాయతో రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 221/5 పరుగులతో ఆడుతోంది. ఓపెనర్లు సల్మాన్‌ ఖాన్‌ (37), సచిన్‌ యాదవ్‌ (43) తొలి వికెట్‌కు శుభారంభం చేసినా.. మహిపాల్‌ లామ్రోర్‌ (13), దీపక్‌ హుడా (17), కార్తీక్‌ శర్మ (0)లు స్పిన్‌కు దాసోహం అయ్యారు. కునాల్‌ సింగ్‌ (64 నాటౌట్‌), అజయ్ సింగ్‌ (42 నాటౌట్‌) ఆరో వికెట్‌కు అజేయంగా 104 పరుగులు జోడించారు. రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో మరో 143 పరుగుల వెనుకంజలో నిలిచింది. నేడు ఉదయం సెషన్లో పేసర్లు, స్పిన్నర్లు మెరిస్తే.. హైదరాబాద్‌కు విలువైన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కటం లాంఛనమే.

8 బంతుల్లో 8 సిక్స్‌లు
ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో మేఘాలయ్ ఆటగాడు ఆకాశ్‌ చౌదరి రికార్డులు బద్దలుకొట్టాడు. సూరత్‌లో అరుణాల్‌ ప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో ఆకాశ్‌ చౌదరి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో గ్యారీ సోబర్స్‌, రవి శాస్త్రి తర్వాత ఈ రికార్డు సాధించిన ఘనత దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా వరుసగా ఎనిమిది బంతుల్లో ఎనిమిది సిక్సర్లు కొట్టిన ఆకాశ్‌ చౌదరి.. 11 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో వేగవంతమైన అర్థ సెంచరీ బాదిన రికార్డునూ సొంతం చేసుకున్నాడు. మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 628/6 పరుగులకు డిక్లరేషన్‌ ఇవ్వగా.. అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఫాలోఆన్‌లో 29/3తో ఓటమి కోరల్లో కూరుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -