- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: పట్టణంలోని శివాజీ విగ్రహం నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉన్న బైపాస్ రోడ్డులో సెంటర్ లైన్‌లో ఏర్పాటు చేసిన హైమాస్ స్ట్రీట్ లైట్లు ఆన్ చేయకపోవడంతో రోడ్డంతా చీకటిలో మునిగిపోయింది. రాత్రి వేళల్లో కాలినడకన వెళ్లేవారు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి సిబ్బంది లైట్లు ఆన్ ఆఫ్ చేయడంలో సమయ పాలన పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -



