నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని రైల్వే పోలీసులు కాపాడారని రైల్వే ఎస్సై సాయి రెడ్డి బుధవారం తెలిపారు. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన ఓ యువతి తనకు పెళ్లి చేయడం లేదనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ హనుమాన్లు కానిస్టేబుల్ పండరి, షి టీమ్ ఇంచార్జి వరలక్ష్మి తనను గమనించి పట్టుకున్నట్లు తెలిపారు.
యువతి యొక్క వివరాలు తెలుసుకొని తను చావకూడదని ఉద్దేశంతో తనకు కౌన్సిలింగ్ ఇచ్చి గౌతమ్ నగర్ లో ఉన్న సదరం హోం (ఆడవారికి సంబంధించిన హోమ్) సూపర్డెంట్ జోష్ణ ని పిలిపించి ఆ యువతిని అప్పగించినట్లు తెలిపారు. సదరం వారు తనకు కౌన్సిల్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.