- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: రానున్న రెండు రోజులు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు చల్లటి కబురు అందించింది. నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. అలాగే, ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -