Saturday, June 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణకు ఐదురోజుల పాటు వర్షసూచన

తెలంగాణకు ఐదురోజుల పాటు వర్షసూచన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌ – హైద‌రాబాద్:  నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని.. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండతో పాటు వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -