- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ పిడుగులు పడే ఆస్కారముందని చెప్పింది. మరోవైపు ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెంలో ఉరుములతో కూడిన వానలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
- Advertisement -



