రోడ్లపై భారీగా వరద…విద్యుత్ సరఫరాలో అంతరాయాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం కూడా భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, ఉస్మానియా యూనివర్సిటీ, విద్యానగర్, నల్లకుంట ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వాన పడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మారెడుపల్లి, చిలకలగూడ ప్రాంతంలో నూ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, సీతాఫల్‌మండి, చిలకలగూడ, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లో కుండపోత వర్షం పడింది. దీంతో రోడ్లపై వరద నీరు చేరడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జవహర్‌నగర్‌లో భారీ వరద ప్రవహించింది. శ్రీ వెంకటేశ్వర కాలనీని వరద నీరు ముంచెత్తింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాలేక ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నివాసాలకే పరిమితం కావాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
పట్టించుకోని ఎస్పీడీసీఎల్
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నగరవాసులు టీజీ ఎస్పీడీసీఎల్ అధికారులకు ఫోన్‌లైన్‌లో సంప్రదించగా.. ఎవరూ అందుబాటులోకి రాలేదు. కొన్ని ఫోన్ నెంబర్లు స్విచ్ఛాప్ రాగా.. మరికొన్ని నెంబర్లకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయా కాలనీల వాసులు విద్యుత్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌ను వీడని వర్షం
- Advertisement -
- Advertisement -



