- Advertisement -
- – చర్యలు చేపట్టని అధికారులు
- నవతెలంగాణ-సుబేదారి
- కలెక్టరేట్ సెల్లార్ లో వర్షం నీరు నిలిచింది. ఇంత వరకు తొలగింపు చర్యలు చేపట్టని అధికారులు. వేల కోట్లు వెచ్చించి కట్టిన కలెక్టరేట్ మెంటనెన్స్ లేక ఇలా ఉండడం గమనార్హం. నీరు నిలిచి ఉండడం వల్ల
- కలెక్టరేట్ లో కంపు, దుర్వాసన వెదజల్లే అవకాశం ఉంది. సెల్లార్ అంతట నీళ్లు నిలిచాయి . వెంటనే మోటార్లు పెట్టి నీళ్లు బయటకు తీస్తే దుర్వాసన రాకుండా ఉంటుందని కలెక్టరేట్ వచ్చే ప్రజలు అంటున్నారు. .నీరు తీసి బ్లీచింగ్ చల్లితే అంటు వ్యాధులు ప్రభల కుండా ఉంటుంది. కలెక్టరేట్ లో ఈ రకంగా నీళ్లు నిలవడం వలన కలెక్టరేట్ వచ్చే ప్రజలు,ఉద్యోగులు ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది పడుతున్నారు.
- దాంతోపాటు రెండు లిఫ్టులు పనిచేయడం లేదు తొందరగా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ కు వచ్చే వాళ్ళు అంటున్నారు.నీట్ గా ఉండాల్సిన కలెక్టరేట్ అంతటా కుక్కలు మలవిసర్జన చేస్తున్నాయి. కుక్కలు కలెక్టరేట్ ఉద్యోగులను వెంటబడి కరుస్తున్నాయి.ఉన్నత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -



