- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మహబూబ్‌నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, కొత్తగూడెం, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు.
- Advertisement -