Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాల బీభత్సం.. రాయిచెడు రైతుకు భారీ నష్టం

వర్షాల బీభత్సం.. రాయిచెడు రైతుకు భారీ నష్టం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామానికి చెందిన రైతు గొడుగు వీరయ్యకు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. చంద్ర వాగు సరిహద్దు ప్రాంతంలోని ఆయన వ్యవసాయ పొలం పక్కగా ప్రవహించే చంద్రవాగు ఉప్పొంగి పాడిబార్లను ముంచెత్తింది. తీవ్ర వర్షాల కారణంగా రాత్రివేళ వాగు ఉప్పొంగి 9 పాడి బర్లు, 4 దూడలు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాయి. స్థానిక రైతులు పోరాడి ప్రాణాలకు సైతం లెక్క చెయ్యకుండా కేవలం ఒక బర్రెను మాత్రమే స్థానిక రైతులు ప్రాణాపాయ స్థితి నుండి రక్షించారు. వరిగడ్డి, పశుగాసం, చప్ కట్టర్ మిషన్ వంటి పరికరాలు కూడా వాగులో కొట్టుకుపోవడంతో రైతు దాదాపు ₹15 లక్షల నష్టం చవిచూశాడు.

వీరయ్య మాట్లాడుతూ, “నా భార్యకు వచ్చిన మా లక్ష్మి సంఘం, శ్రీనిధి లోన్లు పెట్టి బర్లను కొనుగోలు చేశాను. ఇప్పుడు అన్నీ పోయాయి. ఎవరూ సంఘటన స్థలానికి విచారణకు రాలేదు” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ, వీడియో కాల్ ద్వారా రైతుతో మాట్లాడి, “సీఎం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం సహాయం అందిస్తుంది. రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు” అని రైతుకు భరోసా ఇచ్చారు. మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. పోతట్టు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానిక ఎస్సై పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి, ప్రజలను అప్రమత్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -