Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంవానాకాలం పంటలు, సాగు పద్ధతులు, సస్యరక్షణ - ఏడీఏ పెంట్యాల రవికుమార్

వానాకాలం పంటలు, సాగు పద్ధతులు, సస్యరక్షణ – ఏడీఏ పెంట్యాల రవికుమార్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వర్షాధారంగా వానాకాలంలో సాగుచేసే పంటలు ప్రత్తి, వరి, మినుము, వేరుశనగ అయితే ప్రస్తుతం వర్షాలు అక్కడక్కడ అధికంగా,కొన్ని చోట్ల అల్పంగాను వర్షపాతం నమోదు అవుతుంది. ఈ కాలం సాగు చేసే పంటలు యాజమాన్యం పద్దతులు,అధిక వర్షం నుండి సస్యరక్షణ పై వ్యవసాయ శాఖ   అశ్వారావుపేట సహాయ సంచాలకులు (ఏడీఏ) పెంట్యాల రవి కుమార్ రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ లో ఈ వానాకాలం లో వర్షపాతం మరియు పంటల పరిస్థితి ఈ విదంగా ఉంది.

 ప్రత్తి : ప్రధాన పంట ప్రత్తి నియోజక వర్గంలోని 5 మండలాల్లో 31, 288 ఎకరాల్లో సాగు అవుతుంది. ప్రస్తుతం 45 రోజులనుండి 60 రోజుల దశలో ఉంది.అధిక వర్షపునీరు నిలచిన చేలల్లో తక్షణమే నీటిని బయటకు పంపాలి. వేరు కుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల  మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు చుట్టూ పోయాలి. 13 – 0 – 45 (మల్టీ కే) నీటి లో కరిగే ఫెర్టీలైజర్ ను 10 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.పై పాటుగా కాంప్లెక్సు ఎరువులను వాడరాదు. నానో యూరియాను 2 మి.లీ లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.అధికంగా నిలిచిన నీటిని తీసి,వీలైనంత త్వరగా అ అంతర కృషి చేయాలి.

వరి : వరి నాట్లు పూర్తి అయ్యాయి.వర్షాధార పరిస్థితుల్లో నాట్లు అక్కడక్కడ జరుగుతున్నాయి.నాట్లు వేసిన తర్వాత ప్రతి రెండు మీటర్ల కు కాలిబాటలు తీయాలి.కాండం తొలుచు పురుగు,అగ్గితెగులు ఆశించకుండా ఆశించకుండా వరి పొలం గట్ల ను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచాలి.

ప్రధాన అపరాల పంట అయిన మినుము సాగు విత్తే దశలో ఉంది.వేరుశనగ వేసేందుకు చేలు ను సిద్దం చేస్తున్నారు. నియోజక వర్గంలోని 5 మండలాల్లో సాదారణ వర్షపాతం 605.8 మి.మీ కాగా ఇప్పటి వరకు 653.5 మి.మి వర్షపాతం నమోదు అయింది. అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల్లో సాదారణం కంటే అధికంగా వర్షపాతం నమోదు కాగా మిగతా దమ్మపేట, ములకలపల్లి, అన్నపు రెడ్డి పల్లి మండలాల్లో సాదారణ వర్షపాతం నమోదు అయింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad