Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యునైటెడ్ నేషన్స్ సిమిలేషన్ కు ఎంపికైన రాయపోల్ విద్యార్థి

యునైటెడ్ నేషన్స్ సిమిలేషన్ కు ఎంపికైన రాయపోల్ విద్యార్థి

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
విద్యార్థులలో అంతర్జాతీయ అంశాలపై అవగాహన, దౌత్య నైపుణ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో సిద్ధిపేట ఐఓసి వద్ద నిర్వహించిన జిల్లా స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్  సిమిలేషన్‌లో పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోల్ కు చెందిన విద్యార్థిని పూజ రాష్ట్ర స్థాయికి ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫిలిప్పీన్స్ దేశ రాయబారిగా అనుకరించి రాష్ట్ర స్థాయి సిమిలేషన్‌లో పాల్గొనే అవకాశం ఆమెకు లభించింది. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు సావిత్రి మెంటర్‌గా శిక్షణ ఇచ్చిన ఫలితంగా పూజ ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటేశ్వర్లు విద్యార్థిని పూజను, ఆమెకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయురాలు సావిత్రిని అభినందించారు. రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఇతర విద్యార్థులు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -