Friday, December 26, 2025
E-PAPER
Homeసినిమా'రాజా సాబ్‌' క్రిస్మస్‌ కానుక

‘రాజా సాబ్‌’ క్రిస్మస్‌ కానుక

- Advertisement -

ప్రభాస్‌ నటిస్తున్న నూతన చిత్రం ‘రాజాసాబ్‌’. మారుతి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ప్రేక్షకులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ టీమ్‌ ఈ చిత్రం నుంచి ‘రాజే యువ రాజే..’ పాట ప్రోమోను రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ ప్రోమోలో ప్రభాస్‌ క్రిస్మస్‌ పండుగ సెలబ్రేషన్స్‌ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్‌తో ప్రేయర్‌ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్‌ ప్రోమో ద్వారా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ పండుగ విశెస్‌ చెప్పడం యాప్ట్‌గా ఉంది. త్వరలోనే ఈ సాంగ్‌ ఫుల్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హర్రర్‌ కామెడీ జోనర్‌లో ఎవర్‌ గ్రీన్‌ మూవీగా నిలిచిపోయేలా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో అన్‌ కాంప్రమైజ్డ్‌గా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

‘ఈ తరహా జోనర్‌లో ప్రభాస్‌ నటించడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఈ అంచనాలు మరింతగా పెంచడానికి దోహదం చేశాయి. అందరి అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన మార్క్‌ వినోదం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది’ అని మేకర్స్‌ తెలిపారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌, బొమన్‌ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటింగ్‌ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ – కార్తీక్‌ పళని, మ్యూజిక్‌ – తమన్‌, ఫైట్‌ మాస్టర్‌ – రామ్‌ లక్ష్మణ్‌, కింగ్‌ సోలొమన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ – రాజీవన్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ – ఎస్‌ కేఎన్‌, ప్రొడ్యూసర్స్‌ – టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌, రచన, దర్శకత్వం – మారుతి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -