Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమంత్రి పదవిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి దక్కక పోవడంపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. తాను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపర్చే ప్రయత్నంలోనే ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. క్యాబినెట్‌ విస్తరణలో భాగంగా నూతనంగా నియమితులైన మంత్రులను ఆయన అభినందించారు. ప్రజలకు సేవ చేయడంలో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాజకీయాలంటే పదవులు, అధికారమే కాదని, ప్రజలపై ఉన్న నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణంపై ఉన్న కలలే ప్రేరణగా కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి వచ్చానన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad