- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బ్రిటీష్ రాజ్యాధికారానికి చిహ్నాలుగా ఉన్న ఆనవాళ్లను ప్రభుత్వం తొలగిస్తున్నది. దీనిలో భాగంగా ఇవాళ ఎడ్విన్ లుటెన్స్ ప్రతిమను తొలగించి, దాని స్థానంలో తొలి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి ప్రతిమను ప్రతిష్టించారు. రాష్ట్రపతిపభవన్ వద్ద చక్రవర్తి రాజగోపాలాచారి ప్రతిమను ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. అశోక మండపం వద్ద ఉన్న గ్రాండ్ ఓపెన్ స్టెయిర్‌కేస్ దగ్గర చక్రవర్తి రాజగోపాలాచారి బొమ్మను ఏర్పాటు చేశారు.

- Advertisement -



