Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాచకాల్వకు మరమ్మత్తులు చేయాలి: మాయకృష్ణ

రాచకాల్వకు మరమ్మత్తులు చేయాలి: మాయకృష్ణ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పెద్ద చెరువులోకి నీరు వచ్చే రాచ కాలువలో చెట్లు, పిచ్చి మొక్కలు, రాళ్లను తీసివేసి నీరు వచ్చే విధంగా  మరమ్మత్తులు చేసి పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాచ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద చెరువు నిండకపోవడానికి నీటిపారుదల అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. మన్నె వారి పంపు  పక్కన కాలువలో పెద్ద చెట్లు, మట్టితో కూడుకుపోయి కాల్వ ఉందన్నారు. వెంచర్ల వాళ్ళు కాలువ స్థలాన్ని ఆక్రమించడం వల్ల పెద్ద ఎత్తున నీరు రావడం లేదన్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో భూకబ్జాదారుల ఇస్తారాజ్యంగా మారిందన్నారు. 

బీబీనగర్ చెరువుతోపాటు పలు గ్రామాల చెరువులు నుండి అలుగు పోస్తున్నాయని, భువనగిరి పెద్ద చెరువులోకి రావాల్సిన నీరు రావడంలేదని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి కాల్వ మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు గంధ మల్ల మాతయ్య పట్టణ కమిటీ సభ్యులు వల్దాస్ అంజయ్య, పట్టణ నాయకులు మధ్యబోయిన  సుందరయ్య  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -