Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్రాజన్నకు జోడు కోడెలు, బద్దీ పోచమ్మకు బోనాలు..

రాజన్నకు జోడు కోడెలు, బద్దీ పోచమ్మకు బోనాలు..

- Advertisement -

– వేములవాడలో వ్యాపారుల ఆషాడ వేడుకలు..
– వ్యాపారాలు వృద్ధి చెందాలని, లోకం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించిన వ్యాపారులు..
నవతెలంగాణ – వేములవాడ

వేములవాడ పట్టణంలోని బద్దీ పోచమ్మ వీధిలో మంగళవారం శ్రీ రాజరాజేశ్వర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో జోడు కోడెలు, బోనాల కార్యక్రమాలు జరిగాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామికి కోడెలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, బద్దీ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.
గత 12 సంవత్సరాలుగా ప్రతి ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ కార్యక్రమం స్థానిక ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు పిన్నింటి హన్మాండ్లు మాట్లాడుతూ, తమ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, కుటుంబాలు చల్లగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, సమాజం సుఖశాంతులతో నిండిపోవాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి, బద్దీ పోచమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఎల్ల పోశెట్టి, చేనిల్లపతి కూర దేవయ్య, కుస హరీష్, నక్క వేణు, ఆడెపు శ్రీనివాస్, మంత్రి రమేష్, ఐతం శంకర్, ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల నాగరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -