Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్రాజన్న కోడేలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

రాజన్న కోడేలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలోనీ కోడెలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వాటికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తిప్పాపూర్ లోని గోశాలను గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల ఆవరణలో పారిశుధ్య పనులు నిర్వహించుటకు అదనముగా వర్కర్లను నియమించుటకు ఉద్యోగ ప్రకటన జారీ చేశామని,కోడెల సంరక్షణకు పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవాలని,పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని పనులు చేయించాలని పేర్కొన్నారు.కోడెలకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను వైద్యుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.గోశాలలో నిర్వహిస్తున్న షెడ్ల నిర్మాణ పనులను స్వయంగా తిరిగి పరిశీలించి గోశాల ఆవరణను ఎల్లప్పుడూ శుభ్రం ఉంచాలని, కోడెలకు మెరుగైన దాణా, పచ్చి గడ్డి, తాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి, పశు వైద్యులు, విశ్వహిందు పరిషత్ సభ్యులు రాధాకిషన్ రెడ్డి, ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తో పాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad