Tuesday, September 16, 2025
E-PAPER
Homeఆటలుతెలంగాణ ఫెన్సింగ్‌ సంఘం చీఫ్‌ ప్యాట్రన్‌గా రాజశేఖర్‌ రెడ్డి

తెలంగాణ ఫెన్సింగ్‌ సంఘం చీఫ్‌ ప్యాట్రన్‌గా రాజశేఖర్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి తెలంగాణ ఫెన్సింగ్‌ సంఘం (టీఎఫ్‌ఏ) చీఫ్‌ ప్యాట్రన్‌గా ఎంపికయ్యారు. గతంలో ఫెన్సింగ్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా సేవలందించిన రాజశేఖర్‌ రెడ్డిని చీఫ్‌ ప్యాట్రన్‌గా ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. టిఎఫ్‌ఏ ప్రెసిడెంట్‌ గుత్తా జ్వాల సారథ్యంలో సమావేశమైన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పలు నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. చైర్మెన్‌ సి.ఎల్‌ యాదవ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్‌, చీఫ్‌ అడ్వైజర్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని ఎంపిక చేసింది. లీగల్‌ అడ్వైజర్‌గా శివ్‌శంకర్‌, ప్యాట్రన్స్‌గా హరీశ్‌, నర్సింగ్‌రావు, కరుణ సాగర్‌, విద్యాసాగర్‌, పరమేశ్‌లను టిఎఫ్‌ఏ నియమించింది. నామినేటెడ్‌ పోస్టులకు ఎంపికైనవారికి గుత్తా జ్వాల అభినందనలు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -