ఉప ముఖ్యమంత్రి భట్టితో ఆ రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి హీరాలాల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి సంస్థ రాజస్తాన్‌లో ప్రతిపాదించిన 2,300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లకు తమ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి రాజస్తాన్‌లో సింగరేణి విద్యుత్ ప్రాజెక్ట్‌లపై చర్చించారు. రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ సింగరేణితో కలిసి 1,500 మెగావాట్ల సోలార్, 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పాదన కోసం ఒప్పందం కుదుర్చుకుందనీ, దీనికి తమ రాష్ట్ర క్యాబినెట్ అనుమతి మంజూరు చేసిందన్నారు. రెండు రాష్ట్రాల విద్యుత్ అవసరాలకు ఈ కొత్త ప్రాజెక్టులు ఎంతో దోహదపడుతాయని అభిప్రాయపడ్డారు. వీటిని త్వరగా పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్తాన్‌కు చెందిన అధికారులు కాలూరామ్, ప్రమోద్ శర్మ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఈడీ చిరంజీవి, కో ఆర్డినేషన్ జీఎం టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి విద్యుత్ ప్రాజెక్ట్‌లకు రాజస్తాన్ క్యాబినెట్ ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



