Wednesday, May 14, 2025
Homeట్రెండింగ్ న్యూస్రాజీవ్ యువ వికాసం..శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం

రాజీవ్ యువ వికాసం..శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్‎ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రచారం జరగడంతో యువతలో ఆందోళన నెలకొంది. గ్రామ యువతకు సిబిల్ స్కోర్‎పై పెద్దగా అవగాహన ఉండదని.. స్కీమ్ గైడ్ లైన్స్‎లో ఈ అంశాన్ని చేర్చొద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ యువ వికాసం స్కీముపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.
సిబిల్ స్కోర్‎తో రాజీవ్ వికాసం స్కీమ్‎కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అవగాహన లేని కొన్ని సోషల్ మీడియా, ఇతర సంస్థలు సిబిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ స్కీమ్‎కు సంబంధించి మండల స్థాయిలో ప్రాసెస్‎ను ప్రారంభమైందని.. జూన్ రెండవ తేదీ కల్లా లబ్ధిదారులకు మంజూరు లెటర్లు అందజేస్తామన్నారు. నిరుద్యోగ యువత తలెత్తుకొని బతికెందుకు రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
మంగళవారం (మే 13) భద్రాద్రి కొతగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం, టేకులపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భట్టి శంఖుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం లాంటి స్కీమ్ భారత దేశంలోనే ఎక్కడ లేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధి అవకాశాన్ని ఎంచుకొని ఎదగడానికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఒక వరం లాంటిదన్నారు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి భృతిని, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని మండిపడ్డారు.
గత పది సంవత్సరాలు తెలంగాణ యువత నిరాశ నిస్పృహల్లో బతికిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 52,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించామని గుర్తు చేశారు. ఇల్లందు నియోజకవర్గంలోని తులారం ప్రాజెక్ట్, బయ్యారం పెద్ద చెరువు మరమ్మత్తులతో పాటు ఇల్లందు ప్రాంతంలో సర్వే చేసి నివేదికను తయారుచేసి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -