Sunday, November 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలురాజేంద్ర ప్రసాద్‌కు టి.ఎల్‌.కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

రాజేంద్ర ప్రసాద్‌కు టి.ఎల్‌.కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

- Advertisement -

300కి పైగా చిత్రాలలో విభిన్న తరహ పాత్రలతో తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పదిల పరుచుకున్న రాజేంద్ర ప్రసాద్‌కు నట ప్రపూర్ణ టి.ఎల్‌.కాంత రావు స్మారక జాతీయ పురస్కారాన్ని అందజేయ నున్నారు. కాంతారావు 102వ జయంతి సందర్భంగా అందించనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్‌ కే.వి. రమణాచారి, కన్వీనర్‌ నాగబాల సురేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలియచేసారు.
ఈ నెల 21వ తేదిన ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానం ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా రాష్ట్ర మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణా రాష్ట్ర ఎఫ్‌డిసి చైర్మన్‌ దిల్‌ రాజుతో పాటు మరెందరో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -