Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత పక్షపాతి రాజీవ్ గాంధీ  

యువత పక్షపాతి రాజీవ్ గాంధీ  

- Advertisement -

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ 
నవతెలంగాణ – పెద్దవంగర

దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యువజన, మహిళల పక్షపాతి అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..చిన్నతనంలో ప్రధాని బాధ్య తలు చేపట్టిన ఆయన శాస్త్ర, సాంకేతిక రంగంలో దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటుహక్కును కల్పించిన ఘనత రాజీవ్‌దేనని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త కృషిచేయాలని పిలుపునిచ్చారు.

దేశాభివృద్ధికి పాటుపడుతున్న ఆయనను సంఘవిద్రోహులు తుదముట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మండల నాయకులు ముత్యాల పూర్ణచందర్, బానోత్ సీతారామ్ నాయక్, దాసరి శ్రీనివాస్, ఎండీ జాను, దుంపల శ్యామ్, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, ఆవుల మహేష్, సుంకరి అంజయ్య, బోనగిరి లింగమూర్తి, ఆవుల మహేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -