Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశంలో సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్ గాంధీ

దేశంలో సాంకేతికతకు ఆద్యుడు రాజీవ్ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
దేశంలో సాంకేతిక వినియోగాన్ని పెంచడం ద్వారా దేశంలో ఆధునిక సాంకేతిక పాలనకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీదేనని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి కీర్తించారు. రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దివంగత నాయకుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంతో పాటు రాజకీయాల్లో యువశక్తికి అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు.

రాజీవ్‌గాంధీ ఓటు హక్కును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించడం ద్వారా యువతకు సామాజిక బాధ్యతను అప్పగించడం చారిత్రాత్మకమన్నారు. రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు నేటితరానికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ విజయాలను అందిపుచ్చుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల అధ్యక్షుడు కోతి కళ్యాణ్ గౌడ్, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఎనగందుల మురళి, ఎండి నయీమ్, వనజ రాణి, సుదర్శన్ రెడ్డి, యాకుబ్, పాల్వంచ కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -