Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -చండూరు
దేశానికి సాంకేతికత విప్లవానికి నాంది పలికిందిరాజీవ్‌ గాంధీనేనని  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొరిమి ఓంకారం, చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడు  అన్నారు. రాజీవ్‌ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా బుధవారం చండూరు చౌరస్తాలో గల రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్‌ గాంధీనే అని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. భారతదేశం కోసం తన ప్రాణాలనే త్యాగం చేశాడని, రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నిబద్ధతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.  కంప్యూటర్ యుగానికి నాంది పలికారని అన్నారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు.నేటి యువత రాజీవ్ గాంధీ మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  టస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ లు కోడి గిరిబాబు, కావలి ఆంజనేయులు, నల్లగంటి మల్లేష్, బోమ్మరగొని సైదులు, మేకల వెంకట్, మందడి శేఖర్ రెడ్డి, డైరెక్టర్లు భూతరాజు ఆంజనేయులు, నరసింహ, మాజీ కౌన్సిలర్ మంచుకొండ సంజయ్, సంకోజు బ్రహ్మం, కల్లెట్ల మారయ్య, భూతరాజు వేణు, భూతరాజు దశరథ, బెల్లంకొండ శేఖర్, గండూరి జనార్ధన్, భీమనపల్లి శేఖర్, పున్నా ధర్మేంద్ర, పన్నాల లింగయ్య, గజ్జల కృష్ణారెడ్డి, ఇర్గి శంకర్, వెంకటేశం, నల్ల కృష్ణయ్య, మహిళ అధ్యక్షురాలు పల్లవి జంగయ్య, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -