Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్షరతులు లేకుండా రాజీవ్ వికాస్ అమలు చేయాలి 

షరతులు లేకుండా రాజీవ్ వికాస్ అమలు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి : షరతులు లేకుండా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని మంగళవారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పడగల శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకంలో రు 50 వేల నుండి రు 4 లక్షల వరకు సబ్సిడీపై అందజేసి యువతను ఆదుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, పథకంలో కొర్రీలు పెట్టి యువతను ఇబ్బందులను పెడుతుందని, సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్లు మంజూరు అవుతాయని ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు అని అన్నారు. డ్వాక్రా మహిళలు, గ్రామీణ ప్రాంత యువతి యువకులు లోన్లు తీసుకొని, ఆర్థిక ఇబ్బందులతో సరైన సమయానికి కిస్తీలు కట్టని వారు, తిరిగి చెల్లించాలని వారికి సిబిల్ స్కోర్ పడిపోతుందని, వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భేషరతుగా దరఖాస్తు చేసుకున్న ప్రతి యువతి యువకులకు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహిపాల్, డాక్టర్ సుధాకర్, బాల్ దేవ్ అంజయ్య, నోముల లింగం, పూసల లింగం, సంపత్, కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -