Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి : డీవైఎఫ్ఐ

రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి : డీవైఎఫ్ఐ

- Advertisement -

– ప్రజవాణిలో జిల్లా కలెక్టర్ కు డీవైఎఫ్ఐ వినతి

నవతెలంగాణ హైదరాబాద్: రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని సోమవారం ప్రజవాణిలో జిల్లా కలెక్టర్ కు డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ వినతి పత్రం అందజేసింది. అనంతరం డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం. డి జావీద్ మాట్లాడుతూ.. ”రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత 16లక్షల25వేల మంది దరఖాస్తులు, హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించింది. కానీ దరఖాస్తుల పరిశీలన అయిపోలేదని వాయిదా వేయడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి నిధులు మంజూరు చేయాలని, బడ్జెట్ ని పెంచి అర్హులైన వారందరికీ పథకాన్ని వర్తింపచేయాలి’’ అని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు రాజయ్య, రాము తదితరులు పాలొగొన్నారు.

డిమాండ్స్ :-

1.రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులందరికి నిధులు మంజూరు చేయాలి

2.ఈ పథకానికి బడ్జెట్ లో నిధులు పెంచాలి

3.రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన వారందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad