Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్బ్యాంకు లింకేజీ లేకుండా రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి

బ్యాంకు లింకేజీ లేకుండా రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి

- Advertisement -

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్ర నర్సింలు..
నవతెలంగాణ – రాయపోల్ 
: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని, ఈ పథకంలో బ్యాంక్ లింకేజీ లేకుండా రాజీవ్ యువ వికాసం రుణాలు ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను కోరడం జరిగిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్ర నర్సింలు అన్నారు. శనివారం హైదరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కానీ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ లేకుండా రుణాలు మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కోరడం జరిగిందన్నారు. అలాగే లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఉన్నవారు మాత్రమే అర్హులు అనడం సరైనది కాదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో అధిక శాతం యువత సిబిల్ స్కోర్ ఉండదన్నారు. దానివల్ల చాలామంది నిరుద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందలేరన్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాట్ వెంకట్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఏటి భాను ప్రసాద్, టీఎండి రాష్ట్ర నాయకులు కొక్కొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -