- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఓ మ్యాగజైన్‌లోని ఓ రెండు పేరాలు ఇద్దరీ మధ్య మాటల యుద్ధానికి తెరలెపాయి. చైనాకు చెందిన రెండు యుద్ధ ట్యాంకులు భారత్ భూభాగంలోని డోక్లాంలో దూసుకొచ్చాయని రాహుల్ గాంధీ చదివారు. ఆయన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
- Advertisement -



