Wednesday, November 5, 2025
E-PAPER
Homeసినిమా'రాజు వెడ్స్‌ రాంబాయి' బ్లాక్‌ బస్టర్‌ ఖాయం

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ బ్లాక్‌ బస్టర్‌ ఖాయం

- Advertisement -

అఖిల్‌, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ ప్రొడక్షన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్‌, మాన్‌ సూన్స్‌ టేల్స్‌ బ్యానర్స్‌ పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు.
మంగళవారం ఈ సినిమా నుంచి ‘రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్‌ సాంగ్‌ను హీరో మంచు మనోజ్‌, ఆయన సతీమణి భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. లిరిసిస్ట్‌ మిట్టపల్లి సురేందర్‌, నటుడు శివాజీ రాజా, నటుడు చైతు జొన్నలగడ్డ, ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌, ఈటీవీ విన్‌ హెడ్‌ సాయికష్ణ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి, హీరోయిన్‌ తేజస్వినీ రావ్‌, హీరో అఖిల్‌ ఉడ్డెమారి, సింగర్‌ నల్లగొండ గద్దర్‌ నర్సన్న తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ, ‘ప్రేమ చాలా ప్రమాదకరమైనది, అది సింహాసనం ఎక్కిస్తుంది, శిలువనూ వేయిస్తుంది. ఈ సినిమా కథ దర్శకుడి ఊహలో నుంచో, పుస్తకాల నుంచో, కల్పన నుంచో రాలేదు. ఈ మట్టి నుంచి వచ్చింది. రాజు, రాంబాయి ప్రేమలో సంతోషం ఉంది, దుఖం ఉంది. వీళ్లందరి ప్రేమే ఈ సినిమాను నిలబెడుతుందని నమ్ముతున్నా. గతించిన చరిత్రకు, ప్రస్తుత చరిత్రకు ఈ సినిమా ఒక సాక్ష్యంగా నిలుస్తుంది’ అని అన్నారు. ‘ఒక్క డైలాగ్‌, ఒక్క పాట కోసం ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాం. ఆ పాట ఇదే. ఈ పాటను రిలీజ్‌ చేయడానికి గొప్ప ప్రేమ జంట కావాలి. అది మనోజ్‌, మౌనికే’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి చెప్పారు. ‘ప్రేమికులు ఈ సినిమాను చూసి నవ్వుతారు, ఏడుస్తారు. సినిమా చూస్తున్న వాళ్లకు వాళ్ల ప్రేమ గుర్తుకొస్తుంది. ఈ పాట ఎంత బాగుందో సినిమా అంత బాగుంటుంది’ అని డైరెక్టర్‌ సాయిలు కంపాటి చెప్పారు.
ప్రొడ్యూసర్‌ రాహుల్‌ మోపిదేవి మాట్లాడుతూ,’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి, లిరిసిస్ట్‌ మిట్టపల్లి సురేందర్‌ మా సినిమా ఆల్బమ్‌ను అద్భుతంగా తయారు చేశారు. అన్నారు’ అని తెలిపారు.
‘ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. లైట్‌ మూవ్‌మెంట్స్‌తో వెళ్తూ హెవీ ఎమోషన్‌తో పూర్తవుతుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. అన్ని అవార్డ్స్‌ ఈ సినిమాకు వస్తాయి’ అని మంచు మనోజ్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -