Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫాంటసీ కామెడీ నేపథ్యంలో 'రాకాస'

ఫాంటసీ కామెడీ నేపథ్యంలో ‘రాకాస’

- Advertisement -

‘కుర్రోళ్ళు’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత నటి, నిర్మాత నిహారిక నిర్మిస్తున్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో నిహారిక తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ పతాకంపై ఉమేష్‌కుమార్‌ బన్సాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సంగీత్‌శోభన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. టైటిల్‌ ఖరారు చేసిన సందర్భంగా నిర్మాతలు నిహారిక కొణిదెల, ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌ మాట్లాడుతూ,’సంగీత్‌ శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మేం స్టార్ట్‌ చేసిన సినిమాకు ‘రాకాస’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశాం. ఇదొక ఫాంటసీ కామెడీ మూవీ. నయన్‌ సారిక కథానాయికగా నటిస్తోంది.

ఒక సాంగ్‌, నాలుగు రోజుల టాకీ పార్ట్‌ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. త్వరలోనే దాన్ని కంప్లీట్‌ చేస్తాం. సమ్మర్‌ సందర్భంగా ఏప్రిల్‌ 3న ఈ మూవీని రిలీజ్‌ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను, సుక్విందర్‌ సింగ్‌, అన్నపూర్ణ, అమన్‌, అనూప్‌సింగ్‌ ఠాకూర్‌, రమణ భార్గవ్‌, వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి నిర్మాతలు : నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్‌ బన్సాల్‌, కథ, స్క్రీన్‌ప్లే,మాటలు, దర్శకత్వం : మానస శర్మ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : మన్యం రమేష్‌, ఆడిషనల్‌ స్క్రీన్‌ప్లే : మహేష్‌ ముప్పాల, సంగీతం: అనుదీప్‌ దేవ్‌, సినిమాటోగ్రాఫర్‌ : రాజు ఎదురోలు, యాక్షన్‌ కొరియోగ్రఫీ : విజయ్, ఎడిటింగ్‌ :అన్వర్‌ అలీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : రామాంజనేయులు, ఆర్ట్‌ డైరెక్టర్‌ : పుల్ల విష్ణువర్ధన్‌, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ : సంధ్య సబ్బవరపు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -