‘కమిటీ కుర్రోళ్లు’ వైవిధ్యమైన కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణిదెల.
తాజాగా నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో ‘రాకాస’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో నటుడిగా మెప్పించిన సంగీత్ శోభన్ తొలిసారి సోలో హీరోగా ఇందులో నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సంగీత్ శోభన్ సోలో హీరోగా తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూ మెప్పించబోతున్నాడనే ఎగ్జైట్‌మెంట్‌తో అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సంగీత్ చేతిలో కాగడా పట్టుకుని చీకటిలో దేన్నో వెతుకుతున్నాడు. ఇది మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్, ఆడిషన్ స్క్రీన్ ప్లే: మహేష్ ఉప్పాల, సంగీతం: అనుదీప్ దేవ్, సినిమాటోగ్రఫీ: రాజు ఎదురోలు, ఎడిటర్: అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్: రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్: పుల్ల విష్ణు వర్ధన్.
‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



