నటి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా జీ స్టూడి యోస్ సమర్పణలో, తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతున్నారు. ‘రాకాస’ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, ప్రమోషన్స్ చేస్తున్న తీరు ఆడియెన్స్‌లో క్యూరియా సిటీని పెంచింది. గ్లింప్స్‌కి అయితే నెక్ట్స్ లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, అనుదీప్ దేవ్ ఆర్‌ఆర్, రాజు ఎదురోలు విజువల్స్‌తో చేసిన మ్యాజిక్ అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఓవర్సీస్ రిలీజ్ కోసం టీం చేసిన ప్రమోషన్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి. ఓవర్సీస్‌లో ఈ మూవీని అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. మార్చి 1న టీజర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్‌ను చూస్తుంటే కథ ఎలా ఉండబోతోంది?, సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటి? అన్నది అర్థమైపోతోంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్, సంగీతం: అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్: రాజు ఎదురోలు, యాక్షన్ కొరియోగ్రాఫర్: విజరు, ఎడిటర్: అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్: రామాంజ నేయులు, ఆర్ట్ డైరెక్టర్: పుల్ల విష్ణు వర్ధన్, కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య సబ్బవరపు.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘రాకాస’
- Advertisement -
- Advertisement -



