- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్క తమ్ముడు, అన్నా చెల్లెలు అనురాగానికి ప్రత్యేకగా రాఖీ వేడుకలను జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మండలంలోని ప్రతి ఇంట ఆడపడుచులతో సందడి నెలకొంది. అన్నా, తమ్ముళ్లకు రాఖీలు కట్టిన అక్క చెల్లెళ్లు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆప్యాయతకు, అనురాగానికి రాఖీ వేడుకలు ప్రత్యేకగా నిలిచాయని తెలిపారు.
- Advertisement -