నవతెలంగాణ – గోవిందరావుపేట
రాఖీలు, స్వీట్లు కొనుగోలులో బిజీగా ఆడపడుచులు రాఖీ పండగ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో పండగ వాతావరణం దండిగా నెలకొంది. గత రెండు మూడు రోజులుగా రాఖీలు కొనడంలో మామూలుగా కనిపించిన మహిళలు శుక్రవారం నాడు పసర గోవిందరావుపేట చలువాయి ప్రధాన గ్రామాలతో పాటు దుంపల్లిగూడెం కర్లపల్లి లక్ష్మీపురం బుసాపురం గ్రామాలలో సాధారణ కిరాణా షాపుల వద్ద కూడా రాఖీలు ఖరీదు చేస్తూ సందడి చేశారు.
దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇప్పటికే బస్టాండ్ కు చేరుకొని ప్రయాణాలు మొదలుపెట్టారు. రాఖీలతోపాటు అవసరమైన స్వీట్లను కూడా ఖరీదు చేశారు. ఉదయాన్నే షాపులు తెరుచుకోవని మహిళలు రాఖీలతో పాటు స్వీట్లు కూడా కొన్ని ఇళ్లకు తీసుకొని వెళుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాఖీ పండగ ప్రాధాన్యత ప్రాచుర్యము అంతకంతకు పెరుగుతుందని సోదర భావం మరింత బలపడుతుంది అనటానికి ఈ పండగకు పెరుగుతున్న ప్రాధాన్యతే కారణమని అన్నారు. ఇంటి లోని ప్రతి చిన్నపిల్ల మొదలుకొని వృద్ధురాలు వరకు సోదర సమానులైన వారందరికీ రాఖీలు కడుతూ బంధాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు.
గ్రామాల్లో మొదలైన రాఖి పండగ సందడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES