రాఖీతో సోదరభావం పెంపొందుతుంది
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – కాటారం
అన్నా చెల్లెల బంధానికి రాఖీ ప్రతీకగా నిలుస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని శనివారం మంథనిలోని రాజగృహాలో ఆయన సోదరీమణులు శ్వేత, శశికళ లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా నుండి రాఖీ పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, అక్కకు, చెల్లెకు ప్రాణం పోయేవరకు తోడుగా ఉంటానని భరోసా కల్పించేలా రాఖీ కడుతారని ఆయన తెలిపారు.
రాఖీ పండుగతో సోదరబావం పెంపొందుతుందని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రాఖీ పండుగను ఎంతోఆనందంగా జరుపుకుంటారని అన్నారు. నాకు నీవు రక్షా…నేను నీకు రక్షా అంటూ ఆప్యాయతను చాటుతూ అన్నయ్యకు చెల్లెల్లు, తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కడుతారని ఆయన వివరించారు. అనంతరం పలువురు మహిళలు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు రాఖీలు కట్టారు. అలాగే మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ పలువురు నాయకులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంథని నియోజకవర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES