- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండల కేంద్రంలోని కురుక్షేత్ర పాఠశాలలో శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా ముందస్తు రక్షాబంధన్ వేడుకలను పిల్లలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పిల్లలు ఒకరినొకరు రాఖి కట్టుకొని నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనం ఇద్దరం ఈ దేశానికీ, ధర్మానికీ రక్ష అని శుభాకాంక్షలు తెలుపుతూ అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు. రాఖీ పండగ విశిష్టతను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సబ్బిడి నవీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -