- Advertisement -
నవతెలంగాణ-కోహెడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకొని అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని తెలుపుకుంటూ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శనివారం అన్న చెల్లెలు ఆప్యాయతగా రాఖీలు కట్టుకొని, సీట్లు పంపిణీ చేశారు. అన్నచెల్లెల అనురాగానికి నిలువుటద్దంగా రాఖీ పండుగ నిలుస్తుందన్నారు. రాఖీ పండుగ సందర్బంగా మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణం సందడి వాతావరణాన్ని నెలకొంది.
- Advertisement -